TG: మైనారిటీ యువకులను చితకబాదిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని
ఎన్టీఆర్ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి మైనారిటీ యువకులు సపోర్ట్ చేస్తున్నారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు.. సదరు యువకులను చితకబాదారు. బీఆర్ఎస్ పార్టీకి పని చేయకూడదని, గాంధీ చెప్పినట్టు వినాలని కర్రలతో దారుణంగా కొట్టారు. కాగా, ఈ ఘటనలో మైనారిటీ యువకులకు తీవ్రగాయాలు అయినట్లు స్థానికులు వెల్లడించారు.