రైతులు ఇప్పుడు పుదీనా సాగుపై ఆసక్తి చూపుతున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి, మంచి లాభాలు దక్కడంతో ఈ పంటను ఎంచుకుంటున్నారు. పుదీనా కూరలకు ప్రత్యేక రుచి తీసుకొచ్చే ఆకు. తేలికపాటి, సేంద్రీయ పదార్థాలు ఎక్కువగా ఉన్న నేలలు పుదీనాకు అనుకూలం. మురుగునీరు పోయే సదుపాయం ఉంటే పంట ఉత్పత్తి బాగుంటుంది. నల్లరేగడి నేలలు మాత్రం అనుకూలం కావు. అంతర పంటగా పుదీనా అధిక ఆదాయం ఇస్తుంది.