వైద్య శాస్త్రంలోనే అరుదైన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. సోమాలియాకు చెందిన యువకుడికి చిన్నప్పుడు సున్తీ కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకి పురుషాంగం తొలగించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా తిరిగి పొందేందుకు ఫలితం దక్కకపోవడంతో చివరికి హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించాడు. దీంతో వైద్యులు అతడి మోచేతిపై పురుషాంగాన్ని డెవలప్ చేసి, దాన్ని మర్మాంగాలు ఉండే ప్లేస్‌లో అమర్చారు.