హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని MLC కవిత డిమాండ్ చేశారు. యుద్ధ వాతావరణంలో అందాల పోటీలు నిర్వహించడం తప్పుడు సంకేతమని, ఇది విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయమని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. పరిపాలన చేతకాని సీఎం రేవంత్ రాజీనామా చేయాలన్నారు. ఐక్యంగా ఉండి భారత సైన్యానికి అండగా నిలబడుదామని చెప్పారు.