TG: మిస్‌వరల్డ్ 2025 పోటీల కోసం వచ్చిన ప్రపంచ సుందరీమణులు గురువారం సాయంత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ గెస్ట్‌హౌస్ నుంచి బ్యాటరీ వాహనాల్లో చేరుకున్న ప్రపంచ సుందరీమణులు అఖండ దీపారాధన మండపంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులు, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆలయ ఏఈవో భాస్కర్ తదితరులు ఉన్నారు.