యూపీలోని నోయిడా ఫేజ్ 2లో తాజాగా ఆశ్చర్యకర ఘటన జరిగింది. 2015లో అప్పుడు ఏడేళ్ల వయసున్న హిమాన్షు అదృశ్యం అయ్యాడు. అతడి కోసం తల్లిదండ్రులు ఏళ్లుగా వెతికి దుఃఖంలో మునిగిపోయారు. అయితే ఇటీవల పోలీసుల దర్యాప్తులో హిమాన్షు వివరాలు వెల్లడయ్యాయి. కిడ్నాప్ కేసులో తల్లిదండ్రులు ఇచ్చిన వివరాలు హిమాన్షుతో సరిపోయాయి. పోలీస్ స్టేషన్‌లో తన బిడ్డను చూడగానే హిమాన్షు తల్లి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది.