నటనతో పాటు బాలకృష్ణ రాజకీయాల్లోనూ సత్తా చాటారు. తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి.. శాసనసభ ఎన్నికల్లో మొదటి సారి నందమూరి కుటుంబానికి అత్యంత సెంటిమెంట్ అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో మళ్లీ గెలుపొందారు. 2024లో మూడోసారి అత్యధిక మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఎన్టీఆర్ బాటలో సామాన్యుల కోసం పనిచేస్తూ హిందూపురంలో బలమైన నాయకుడిగా నిలిచారు.