వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ మోకాళ్ళపై మెట్లు ఎక్కారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు అష్టశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పశువులతో ఆయురారోగ్యాలతో విరజిల్లాలని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.