కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి బోటులో సముద్రం లోపలికి వెళ్లి రెండు రోజుల క్రితం రవాణాకు సిద్ధమై పట్టుబడిన నౌకలో 640 టన్నుల బియ్యాన్ని స్వయంగా పరిశీలించారు. దీనిపై డీఎస్పీ రఘువీర్ విష్ణువు, ఎమ్మెల్యే కొండబాబును నిలదీశారు.