ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కుమారుడిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన కేసులో అతన్ని మందలించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు కూడా అతనిపై కేసు బుక్ చేశారు. వివిధ రకాలుగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఎమ్మెల్యే కుమారుడిపై 20 వేల జరిమానా కూడా విధించారు. పోలీసు ఆఫీసర్‌తో ఫోన్‌లో ఎమ్మెల్యే దరుసుగా ప్రవర్తించాడని తెలుస్తోంది.