కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి 20 మంది నేత కార్మికులు చనిపోయారని కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న దంపతులు అమర్ - స్రవంతి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి మాట్లాడారు. 'సిరిసిల్లలో నేను ఎమ్మెల్యేగా ఉండటం నీకు నచ్చకుంటే నేను ఉండటం వల్ల ఇక్కడ ఇబ్బందులు వస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మేము ప్రభుత్వంలో లేము కొన్ని కుటుంబాలను మాత్రమే ఆదుకోగలం' అని అన్నారు.