ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన సోమవారం దిశానిర్దేశం చేశారు. ఈనెల 27న రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ పథకాలను వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. కూటమి నేతలు కూడా సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.