ఏపీ, తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు

52చూసినవారు
ఏపీ, తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు
ఏపీ, తెలంగాణకు 3 రోజులు వర్ష సూచన ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇవాళ (శనివారం) TGలో ఉదయం నుంచి మేఘాలతో కూడిన వాతావరణం ఉండగా.. సాయంత్రం 4 తర్వాత నుంచి రాత్రి 10 గంటలవరకూ ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు చోట్ల ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఇక ఏపీలోని రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్