తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

51చూసినవారు
తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు
TG: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఓ మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచించింది. కాగా గత రెండు రోజుల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు హనుమకొండ జిల్లా పరకాలలో 3 సెం.మీ., మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలో 2, కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో 2, మెదక్‌ జిల్లా రామాయంపేటలో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.

సంబంధిత పోస్ట్