బ్రెజిల్‌కు చేరుకున్న మోదీ.. ఘన స్వాగతం పలికిన లూయిజ్ (వీడియో)

11చూసినవారు
17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ బ్రెజిల్‌ చేరుకున్నారు. రియో డి జనీరోలోని గలేలియో అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వ మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇది మోదీకి నాలుగో బ్రెజిల్‌ పర్యటన. ఈ సందర్భంగా మోదీ-లూలా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వ్యాపారం, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, వ్యవసాయం తదితర రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించనున్నారు.

సంబంధిత పోస్ట్