అయోధ్యలో నిర్మించిన రామమందిరం తొలి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దశాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం తర్వాత బాల రాముడి ఆలయం నిర్మించుకున్నాం. మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు ఈ ఆలయం ఘన వారసత్వంగా నిలిచింది’ అని పేర్కొంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు. కాగా 2024 జనవరి 11న అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించి, జనవరి 22న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించారు.