అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయంలో భారతీయ యువకుడిని భద్రతాధికారులు నేలపై పడేసి, అతడి చేతులను వెనక్కి మడతపెట్టి అరెస్టు చేసిన ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో పదే పదే భారతీయులపై అవమానకర ఘటనలు చోటుచేసుకుంటున్నా, మోదీ మాత్రం మౌనం వీడటం లేదని విమర్శించారు.