ప్రధాని మోదీపై బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నిఖిల్ కామత్ పోడ్ కాస్ట్ లో ప్రశంసలు కురిపించారు. “మోదీ అంటే ఎంతో ఇష్టం. ఆయన అయస్కాంతంలా అందరినీ ఆకర్షిస్తారు. నాలుగేళ్ల క్రితం నటీనటులు, దర్శకులు అందరం ఆయన్ని కలిసేందుకు వెళ్లాము. ఆయన అందరితో ఎంతో చక్కగా మాట్లాడారు. ఆ స్థాయి నేతకు అలా కలిసిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ, ఆయన మాట్లాడారు. అది ఆయన గొప్ప వ్యక్తిత్వం” అని అన్నారు.