మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి: పాకిస్తాన్

51చూసినవారు
మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి: పాకిస్తాన్
ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. శాంతి, స్థిరత్వం కోసం కృషి జరుగుతున్న సమయంలో మోదీ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంది. ఇండియా చర్యలు ఈ ప్రాంతాన్ని ప్రమాదంలో పడేసేలా ఉన్నాయని పేర్కొంది. కాల్పుల విరమణను తాము కోరలేదని పాక్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము కట్టుబడి ఉన్నామని పాక్ వెల్లడించింది.