ప్రధాని మోదీ ఏపీలో మరోసారి పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. జూన్ 20న భువనేశ్వర్ నుంచి విశాఖకు చేరుకుంటారు. తూర్పు నావికాదళం గెస్ట్‌హౌస్‌లో మోదీ బస చేయనున్నారు. జూన్ 21న ఉదయం 6:30 గంటల నుంచి 7:45 వరకు ఆర్కే బీచ్ రోడ్డులో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో పాల్గొననున్నారు. అదే రోజు ఉదయం 11:50కి విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.