డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ

79చూసినవారు
డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘నా ప్రియ మిత్రుడు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడటం ఆనందంగా ఉంది. రెండోసారి చారిత్రాత్మకంగా గెలుపొందిన ఆయనను అభినందించాను. భారత్, అమెరికాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన, విశ్వసనీయ భాగస్వామ్యానికి మేము కట్టుబడి ఉన్నాం. మా ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తాం. ప్రపంచశాంతి, భద్రత కోసం కృషిచేస్తాం’ అని మోదీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్