పుతిన్‌ కారులో మోదీ షికారు.. (వీడియో వైరల్‌)

57చూసినవారు
ప్రధాని మోదీ రష్యా పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నిన్న ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్కో శివార్లలోని నోవో-ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్‌ సాదరంగా ఆహ్వానించారు. మోదీకి పుతిన్‌ తన అధికారిక నివాసాన్ని దగ్గరుండి మరీ చూపించారు. గోల్ఫ్‌కార్ట్‌ (గోల్ఫ్‌కారు)లో షికారు చేస్తూ ఇంటి ప్రాంగణంలో కలియ తిరిగారు. మోదీని పక్కనే కూర్చోబెట్టుకుని గోల్ఫ్‌ కారును పుతిన్‌ స్వయంగా నడపడం విశేషం.

ట్యాగ్స్ :