TG: మంచు మోహన్ బాబు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయనకు వైద్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజులుగా ఆయన కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాల కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. మంగళవారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మోహన్ బాబును విష్ణు చేర్పించారు. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇవాళ రాచకొండ కమిషన్ ముందు విచారణకు ఆయన హాజరుకావడంపై సందిగ్ధత నెలకొంది.