గుండెపోటు ఎక్కువగా సోమవారం రోజునే ఎందుకు వస్తుందో తెలుసా? శని, ఆదివారాలు వీకెండ్ డేస్ కదా అని చాలా మంది జంక్ ఫుడ్స్, అల్కహాల్ తీసుకుంటుంటారు. ఇంకా లేటుగా నిద్రపోతారు. సోమవారం ఉద్యోగానికి వెళ్లాలని తొందరగా లేస్తారు. దీంతో శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా శరీరంలోని అంతర్గత వ్యవస్థ సర్కేడియన్ రిథమ్ దెబ్బ తిని హార్ట్ ఎటాక్ సంభవించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే వ్యాయామం, వేళకు నిద్ర, పౌష్టికాహారం తీసుకోవాలి.