తెలంగాణలో రేవంత్ సర్కార్ రైతులకు తీపి కబురును అందించింది. సన్న వడ్లకు బోనస్ డబ్బులు చెల్లింపులను ప్రారంభించింది. చాలా వరకు రైతుల అకౌంట్లో డబ్బులను జమ చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ మేరకు రూ.6,43,32,200 కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో రూ.2,78,94,800 చెల్లింపుల ప్రక్రియలో ఉన్నాయి.