ఓ వానరం గద పట్టుకొని సాక్షాత్తూ ఆంజనేయస్వామిగా దర్శనమిచ్చింది. తన ప్రతిమ దగ్గరే గద పట్టుకుని నిలబడి భక్తులకు దర్శనమివ్వడంతో చూడడానికి భక్తులు పోటెత్తారు. హనుమంతుడే తమను దీవించడానికి ఇలా వచ్చాడని పలువురు భక్తులు పేర్కొంటున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.