చిరుతపులికి చుక్కలు చూపించిన కోతి.. వీడియో వైరల్

71చూసినవారు
ఆకలితో ఉన్న చిరుతపులికి చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న ఓ కోతి కనిపించింది. దాంతో చిరుత వెంటనే చెట్టుపైకి ఎక్కింది. అయితే చిరుతను గమనించిన కోతి ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకుతూ పులితో ఒక ఆట ఆడుకుంది. కోతిని ఎలా అయినా పట్టుకోవాలని చిరుత కూడా చెట్టుపై అటూ ఇటూ పరుగెత్తింది. చివరకు చిరుత కోతిని ఏ విధంగానూ పట్టుకోలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్