TG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేసే చిరుద్యోగులకు శుభవార్త. వచ్చే నెల నుంచి వీరికి నెలనెలా వేతనాలు చెల్లించాలని ఆ శాఖ నిర్ణయించింది. ప్రతి నెలా సుమారు రూ.115 కోట్లు విడుదల చేయనున్నారు. దీంతో దాదాపు 92 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రతి నెలా 25 వరకు ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగుల హాజరు వివరాలు సేకరించి, 26నే బిల్లులు సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.