అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గురైన ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీసే పని పూర్తయిందని.. వెయ్యికి పైగా డీఎన్‌ఏ టెస్టులు చేయాల్సి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్‌లోనే వీలైనంత త్వరగా డీఎన్‌ఏ టెస్టులు పూర్తి చేస్తామని అమిత్ షా తెలిపారు. "విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉంది. విమానం పేలిన వెంటనే మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో ఎవరినీ కాపాడే పరిస్థితిలేకుండా పోయింది’’ అని అమిత్ షా వివరించారు.