వరిని నష్టపరిచే పురుగులలో ‘దోమ పోటు’ చాలా ప్రమాదకరమైనది. వరి నాటిన 40 రోజుల తర్వాత ఈ పురుగును ఎక్కువగా గమనించవచ్చు. దీనికి నివారణ చర్యలు ఏంటంటే.. వరి పొలంలో గాని, వెలుతురు బాగా సోకే విధంగా దారులు తీయడం వల్ల దోమల ఉత్పత్తి చాలావరకు తగ్గుతుంది. దుక్కిలో సిఫారసు మేరకు పొటాష్, జింక్ ఎరువులను తప్పకుండా వాడాలి. పొలానికి అవసరానికి మించి మంచినీరు పెట్టకూడదు.