కన్నవారి చేతుల్లో హత్యకు గురవుతున్న వారిలో ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువ ఉంటున్నారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసెన్ అధ్యయనంలో తేలింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి దుర్ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం ఆందోళనకరం. తల్లిదండ్రులు పిల్లలను తమ ఆస్తిగా భావిస్తుండడం వల్ల.. వారిపై సర్వాధికారాలూ తమకే ఉన్నాయన్న అనుకుంటున్నారు. ఈ తరహా ఆలోచనలు, మానసిక రుగ్మతలు ఉన్నవారిని గుర్తించి, తగిన చికిత్స చేయించాలి.