మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై వేటకొడవలితో దాడి

81చూసినవారు
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై వేటకొడవలితో దాడి
తెలంగాణాలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిపై ఓ కసాయి కొడుకు వేటకొడవలితో దాడి చేశాడు. మెదక్‌ జిల్లాలో రామాయంపేట మండలం కాట్రాల గ్రామంలో తల్లి నరసమ్మ(55)పై వేటకొడవలితో కుమారుడు దినేష్‌ దాడికి పాల్పడ్డాడు. కుమారుడు దినేష్‌ చేసిన దాడిలో తల్లి నరసమ్మ చేతికి గాయమైంది. దీంతో గ్రామస్థులు దినేష్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్