కర్ణాటకలోని హసన్ జిల్లాలో తాజాగా దారుణం జరిగింది. శివమొగ్గకు చెందిన రఘుకు, శ్వేతకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె శాన్వి (6) ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కొన్నేళ్లుగా తల్లి ఇంటి వద్ద శ్వేత ఉంటోంది. అయితే శాన్వి మాత్రం రఘు తల్లిదండ్రుల వద్ద పెరుగుతోంది. శనివారం అత్తమామల ఇంటికి వచ్చి శాన్విని తీసుకెళ్లింది. పాపను నీటి తొట్టిలో ముంచి చంపింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.