అందం కోసం సర్జరీలు చేయించుకుని ఇద్దరు బిడ్డల తల్లి మృతి

58చూసినవారు
అందం కోసం సర్జరీలు చేయించుకుని ఇద్దరు బిడ్డల తల్లి మృతి
అందం కోసం సర్జరీలు చేయించుకున్న ఓ మహిళ దారుణంగా చనిపోయింది. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌ గుయిగాంగ్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు బిడ్డల తల్లి 24 గంటల వ్యవధిలో ఆరు కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది. అయితే ఆ మహిళ డిశ్చార్జి కాగానే క్లినిక్‌లోని లిఫ్ట్ ముందే కుప్పకూలిపోయి మరణించింది. కాగా, దీనిపై కోర్టును ఆశ్రయించిన ఆమె భర్తకు సదరు క్లినిక్ రూ.70 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఫైన్ వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్