TG: సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తిమ్మారెడ్డిపల్లిలో చర్చి నిర్మాణాన్ని అడ్డుకున్నారని మంగళవారం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన వారికి బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు మద్దతుగా నిలిచారు. అసైన్డ్ భూముల్లో చర్చి నిర్మాణం జరుగుతుండడంతో వాళ్లు అడ్డుకున్నారని పోలీసులకు వివరణ ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తే.. ఊరుకునేది లేదని పోలీసులపై మండిపడ్డారు.