ఆప్ ఘోర ఓటమి పాలైనా అదేమి పట్టనట్లుగా ఆ పార్టీ నేత, సీఎం అతిశీ చేసిన పని చర్చకు దారి తీసింది. ఎమ్యెల్యేగా గెలిచిన తను పార్టీ కార్యకర్తలతో కలిసి చిందులు వేశారు. అయితే సొంత పార్టీ ఓడినా అతిశీ ఇలా డ్యాన్స్ చేయడం సిగ్గుచేటని ఎంపీ స్వాతి మలివాల్ మండిపడ్డారు. సీనియర్ నాయకులందరూ ఓడిపోయారు. అతిశీ ఇలా సంబరాలు చేసుకుంటున్నారా? అని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.