కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సంబంధించిన ముడా స్థల కేటాయింపు కేసులో కర్ణాటక కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ముడా స్థల కేటాయింపు కేసులో దర్యాప్తు కొనసాగించాలని లోకాయుక్త పోలీసులను ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేసే వరకు ఎలాంటి ఉత్తర్వులు ఉండవని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.