యూకేలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం ఎదురైంది. యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో భేటీకి ప్రయత్నించిన యూనస్‌తో సమావేశం అవ్వడానికి స్టార్మర్ విముఖత చూపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక బ్రిటన్ రాజు ఛార్లెస్-3తో కూడా సమావేశం అయ్యేందుకు యూనస్ ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. తనకు స్టార్మర్‌తో ప్రత్యక్ష చర్చలు జరగలేదని, తమ ప్రయత్నాలకు స్టార్మర్ కచ్చితంగా మద్దతిస్తారనే నమ్మకం ఉందన్నారు యూనస్.