జూలై నెలలో మొహర్రం సెలవు విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళంలో ఉన్నారు. జూలై 7 ఆదివారం సెలవు దినం కావడంతో విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అయితే మొహర్రం కోసం అదనంగా సెలవు ఇచ్చే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. దీంతో సోమవారం సెలవుగా ప్రకటించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కంపెన్సేటరీ సెలవుపై స్పష్టత కోసం విద్యార్థులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.