పాతబస్తీలో మొహర్రం ఊరేగింపు (వీడియో)

113చూసినవారు
TG: హైదరాబాద్ పాతబస్తీలో మొహర్రం సందర్భంగా బీబీ-కా-ఆలం ఊరేగింపు ప్రారంభమైంది. భారీ సంఖ్యలో షియా ముస్లిం సోదరులు కత్తులు, బ్లేడ్లతో తమ శరీరాన్ని గాయపరుచుకుని రక్తాన్ని చిందిస్తూ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మొహర్రం సంతాప దినంలో భాగంగా డబీర్‌పురాలోని బీబీ-కా-ఆలం నుంచి ఏనుగు అంబారిపై ఊరేగింపుగా తీసుకెళ్తూ, చార్మినార్, పతర్‌గట్టి, మదినా ప్రాంతాల మీదుగా ఊరేగింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో 3 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్