శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం!

70చూసినవారు
శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవం!
AP: శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం చేశారు. ఈ సందర్భంగా వేకువ జామున శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజాదికాలు, రావణ వాహన సేవలు నిర్వహించారు. ఈ ఉదయం గం. 3.00 లకు ఆలయ ద్వారాలను తెరచి మంగళ వాయిద్యాల అనంతరం గం. 3.30 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఉత్సవ పూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్