TG: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 26తో మున్సిపాలిటీల గడువు ముగియనుండగా సంక్రాంతి తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేసి.. FEB మొదటివారంలోగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారని తెలిసింది. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం వెలువడకపోవడంతో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. మున్సిపాలిటీలకు ఆ సమస్య లేకపోవడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.