ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘డోజ్’ బృందం వైట్ హౌస్ డేటాను భారీగా యాక్సెస్ చేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఈ డేటా ట్రాన్స్‌మిషన్ గోప్యంగా జరిగిందట. ఎటువంటి రికార్డులు లేకుండానే నిర్వహించారట. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుమతితోనే ఇది జరిగిందని, భద్రతాధికారుల అభ్యంతరాల్ని పట్టించుకోలేదని సమాచారం. అయితే మస్క్‌పై డేటా కాపీ చేసిన ఆరోపణలను అమెరికన్ సీక్రెట్ సర్వీస్ తిరస్కరించిందని కథనంలో పేర్కొంది.