TG: తన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గత ప్రభుత్వంలోని మంత్రులు ఏ పనికైనా డబ్బులు తీసుకునేవారని చెప్పడం తన ఉద్దేశమని అన్నారు. అప్పటి మంత్రులను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. వీటిని పలువురు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 'మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారు. నేను అలా తీసుకోను. దానికి బదులుగా సమాజ సేవ చేయండని చెబుతాను' అన్న విషయం తెలిసిందే.