‘ప్రతి పేదవాడికి సొంతిళ్లు నిర్మించి ఇవ్వడమే నా కల’

71చూసినవారు
ఢిల్లీలోని ప్రతి పేదవాడికి కాంక్రీట్ ఇల్లు నిర్మించి ఇవ్వడమే తన కల అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ రాజధానిలోని ద్వారకా ప్రాంతంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొని మాట్లాడారు. 'నాకు సొంత ఇల్లు లేదు, కానీ ప్రతి పేదవాడికి కాంక్రీట్ ఇల్లు నిర్మించి ఇవ్వాలనేదే నా కల. అది జరగకుండా ఆప్ ప్రభుత్వం అడ్డుకుంటుంది’. అని మోదీ విమర్శించారు. ఢిల్లీలోని పేదలకు మంచి జరగాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :