తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. మా వ్యక్తిగత సమాచారం ఎలా తెలుస్తోంది. కరీంనగర్ సీపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు. పోలీసుల ఫోన్లను ట్యాప్ చేయడం సిగ్గుచేటు. దీనిపై హైకోర్టుకు వెళ్తా. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి' అని డిమాండ్ చేశారు.