ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఒత్తిడి వల్లే భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిందని చెప్పుకొచ్చారు. ఇందుకోసం తాను కొన్ని దేశాల అధ్యక్షులను కలిసి చర్చలు జరిపానని, ఆ ఫొటోలు బయటకు రావొద్దని నాయకులు కోరడంతో బయటపెట్టలేదన్నారు. ట్రంప్ తానే యుద్ధం ఆపినట్టు ప్రకటించుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇక ఇటీవల టర్కీ వెళ్లి అక్కడ నాయకుడితో మాట్లాడుతూ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.