AP: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆలనా పాలనా చూడాల్సిన కొడుకే వారిని రోడ్డుపై వదిలేశాడు. దాంతో ఆ వృద్ధ దంపుతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం ముక్కపాటి కాలనీలో వెలుగు చూసింది. వెంకటేశ్వర్లు-కరుణమ్మ దంపతులకు ఒకే ఒక్క కొడుకు. కరుణమ్మ క్యాన్సర్‌తో బాధపడుతుంది. అయితే ఆస్తి పంపకాల్లో భాగంగా కొడుకు కృపారావుకు ఇల్లు రాసిచ్చారు. కానీ తల్లిదండ్రులు ఉన్న ఇంటిపై కన్నేసిన కృపారావు.. వారిద్దరిని ఇంట్లో నుంచి బయటకు పంపేశాడు. కొడుకు, కోడలు తమని చాలా ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోతున్నారు.