ఝార్ఖండ్‌కు చెందిన మనీశ్ విజయ్ కేరళలోని కొచ్చిలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ అదనపు కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఆఫీసుకు నాలుగు రోజులు సెలవు పెట్టి తిరిగి రాకపోవడంతో సహోద్యోగులు ఇంటికి వెళ్లారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. రెండు వేర్వేరు గదుల్లో మనీశ్, అతని సోదరి మృతదేహాలు.. మంచంపై తల్లి మృతదేహం ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.