టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ ట్రైలర్ రిలీజ్ తేదీని చిత్రబృందం ఖరారు చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు రానుంది.